కొల్లేరుకు వరద.. లంక గ్రామాలు గజగజ

ఏలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. 64 ప్రధాన డ్రెయిన్ల ద్వారా ఒకేసారి పెద్దఎత్తున నీరు చేరడంతో నిండుకుండలా తయారైంది. ఇన్ ఫ్లో ఎక్కువ ఉండటం, అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో గ్రామాల సరిహద్దుల వరకు నీరు చేరింది. దీంతో లంక గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతుందేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.