శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్
శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ అటవీ అధికారులు కీలక సూచన చేశారు. సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించొద్దని సూచించారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అప్రమత్తమైన అటవీ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.