VIDEO: మల్లన్న జాతరలో పేకాట జోరు
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో సంక్రాంతి, కనుమ సందర్భంగా జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పేకాట జోరుగా సాగింది. శుక్రవారం మహిళలు బోనాలు ఎత్తి మొక్కులు చెల్లించగా, పురుషులు ఆలయ పరిసరాల్లో బహిరంగంగా పేకాట ఆడుతూ వేలాది రూపాయలు ఖర్చు చేసిన దృశ్యాలు కనిపించాయి. జాతర సమయంలో ఈ పేకాట ఆనవాయితీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.