కదిరి వాసి సుజీత్‌కు పవన్ కళ్యాణ్ బహుమతి

కదిరి వాసి సుజీత్‌కు పవన్ కళ్యాణ్ బహుమతి

సత్యసాయి: సినీ హీరో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ OG దర్శకుడు సుజీత్‌కు ప్రత్యేక బహుమతి అందజేశారు. కదిరి ప్రాంతానికి చెందిన సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజీత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాల్యం నుంచే పవన్ అభిమానినైన తాను ఈ బహుమతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.