స్కేల్‌తో కొలిచారు.. విజేతను ప్రకటించారు!
MBNR: చిన్నచింతకుంట మండలం గూడూరులో కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. తొలుత కాంగ్రెస్ రెబల్ భీమన్నగౌడ్, కాంగ్రెస్ మద్దతుదారు శేఖర్‌కు సమానంగా ఓట్లు వచ్చాయి. టాస్ వేయడానికి నిరాకరించడంతో, ఎన్నికల అధికారులు ఒక చెల్లని ఓటును తీసుకుని, స్కేల్‌తో కొలిచి భీమన్న గౌడ్ వైపు స్వస్తిక్ ముద్ర ఎక్కువ ఉందని నిర్ధారించి, ఆయన్ను ఒక్క ఓటు మెజార్టీతో విజేతగా ప్రకటించారు.