ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు రాజకీయ ఎత్తుగడ: మాజీ ఎంపీ
KMM: తాము పార్లమెంటులోని ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుకు కృషి చేశామని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును కాంగ్రెస్ నేతలు వాడుకోవడం తగదని గురువారం నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని ఆయన విమర్శించారు.