పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి

పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి

AP: ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా పని చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులు, 26 జిల్లాల జీఎంలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆలోచన, లక్ష్యాలకు క్షేత్ర స్థాయిలో పని చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.