విఘ్నేశ్వరుని అన్న ప్రసాద ట్రస్ట్‌కు భారీ విరాళం

విఘ్నేశ్వరుని అన్న ప్రసాద ట్రస్ట్‌కు భారీ విరాళం

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని బుధవారం పి.గన్నవరం మండలం నరేంద్రపురం వాస్తవ్యులు సుబ్రహ్మణ్య కృష్ణ భాస్కర్, లక్ష్మి మానస దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళంగా రూ. 2,50,000 ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి చిత్రపటం అందజేశారు.