పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి: ఎఐఎస్ఎఫ్

KNR: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డిని AISF రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి కోరారు. గురువారం హుజురాబాద్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం, విద్యార్థులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.