పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

MNCL: నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన కడారి బక్కన్న అనే కౌలు రైతు గురువారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బకన్న 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. దాని కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 2 లక్షలు అప్పు చేయగా, అకాల వర్షాలకు పంట నష్టం వచ్చింది. అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.