మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా: SP
GDWL: ఆకతాయిల వేధింపులకు గురైతే మహిళలు, విద్యార్థినులు భయపడి మౌనంగా ఉండొద్దని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వేధింపులకు గురైన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.