కూకట్‌పల్లిలో డ్రగ్స్, గంజాయి పట్టివేత

కూకట్‌పల్లిలో డ్రగ్స్, గంజాయి పట్టివేత

HYD: KPHB కాలనీలోని భాగ్యలక్ష్మి మొబైల్ షాప్ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్‌డీ టీం CI నాగరాజు, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రేణిగుంటకు చెందిన అజయ్ (23) గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి గ్రా. 100 గంజాయి, 0.40 గ్రాముల MDMA డ్రగ్స్, ద్విచక్ర వాహనం, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.