మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు
NZB: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మోపాల్ మండలం మంచిప్పలో నిన్న రాత్రి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మోపాల్ ఎస్సై సుస్మిత మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిస కావద్దని సూచించారు. మండలంలోని గ్రామాల్లో గంజాయి సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశాలపై పోలీసులు నిఘా ఉంచుతారని తెలిపారు.