దేశభక్తి స్ఫూర్తిని నింపిన వందేమాతరం
CTR: వందేమాతరం గీతం లక్షల మందిలో దేశభక్తి స్ఫూర్తిని నింపిందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రజలు, అధికారులు, విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.