పోర్టు కార్యదర్శిగా శంకర్ బాబు బాధ్యతల స్వీకరణ
VSP: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నూతన కార్యదర్శిగా ఎం. శంకర్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆయన మార్మగోవ పోర్ట్ అథారిటీ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర పోర్టులు, నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోర్టు ఉపాధ్యక్షురాలు రోష్ని అపరంజి కొరాటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.