తిరుపతిలో చిరుత సంచారం
AP: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీయూ పాపులేషన్ స్టడీస్, ఐ-బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ అధికారులు హెచ్చరించారు. బ్లాక్‌ల నుంచి బయటికి వచ్చే సమయంలో శబ్దాలు చేస్తూ రావాలని అధికారులు సూచించారు. నైట్ డ్యూటీ చేసేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.