ఉరివేసుకొని మాజీ సర్పంచ్ ఆత్మహత్య

BPT: పంగులూరు మండలం తూర్పు తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు పచ్చ శ్రీనివాసరావు సోమవారం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లి వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.