నేడు పోలీసు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు: ఎస్పీ
ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నేడు జరగాల్సిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) రద్దు అయింది. బందోబస్తు, భద్రతా విధుల్లో పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.