దుర్గమ్మ కొండపై వైభవంగా స్వామివారి కల్యాణం
NTR: సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ కొండపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. మహామండపం 7వ అంతస్తులోని కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) తమ సతీమణితో కలిసి, దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.