'నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'

VZM: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంద్యారాణి సోమవారం సాలూరు పట్టణ ఏరియా ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. వైద్యాధికారి మీనాక్షి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.