VIDEO: పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కాకినాడ నగరంలోని సాలిపేట మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో పిల్లి రమేష్ మూల్యాంకన ప్రక్రియ తీరును ఆయనకు వివరించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి, వారికి కల్పించిన వసతులపై ఆరా తీశారు.