రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: గణపురం మండలం గాంధీనగర్ 11 కేవి ఫీడర్ బ్రేకర్‌లో ప్రొటెక్షన్ వింగ్ వారు మంగళవారం మరమ్మత్తులు చేయనున్నట్లు ఏఈ వెంకటరమణ తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఫీడర్ పరిధిలోని గాంధీనగర్, మైలారం, కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలలో మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు తమకు సహకరించాలని ఏఈ కోరారు.