రేపు బాకరాపేటలో నడివీధి గంగమ్మ జాతర

రేపు బాకరాపేటలో నడివీధి గంగమ్మ జాతర

KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలోని మూడు రోడ్ల కూడలి వద్ద గల గంగమ్మ తల్లి జాతర రేపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అమ్మవారికి మహిళలు వేకువజామునే బోనాలు సమర్పిస్తారని వారు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగమ్మ తల్లి అని వెల్లడించారు. అమ్మవారి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.