VIDEO: అమ్మోరు తల్లికి మహిళల పూజలు

ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి గోండుగూడ మహిళలు, గ్రామస్థులు కలిసి అమ్మోరు తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతిఏడాది కొనసాగుతూ వస్తున్న ఈ పండుగను ఆదివాసీ సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో శాంతి, రైతుల పంటలకు దిగుబడి రావాలని తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు, గోపాలరావు, జుగాదిరావు, జాకు, భీంరావు, తుకారాం ఉన్నారు.