అల్లూరిలో ఎన్‌కౌంటర్.. జిల్లాలో విస్తృత తనిఖీలు
VZM: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.