చదువులకు పేదరికం అడ్డు కాకూడదు: ఎంపీ

చదువులకు పేదరికం అడ్డు కాకూడదు: ఎంపీ

MBNR: పిల్లల చదువులకు పేదరికం అడ్డు రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. పసుపుల జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.27లక్షలు పీఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు,సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు.