నేటి నుంచి జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ల కార్డులకు దరఖాస్తులు

నేటి నుంచి జర్నలిస్టులకు  అక్రిడిటేషన్‌ల కార్డులకు దరఖాస్తులు

ప్రకాశం: జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.