రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయత్నం

రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయత్నం

NTR: విజయవాడలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించిన వాహనదారులను అభినందించి, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం వారికి రోజా పూలు అందజేశారు. నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాలను గౌరవించడం, స్వీయ భద్రతే కుటుంబ భద్రత అని ఆమె తెలిపారు.