కాళేశ్వరం త్రివేణి సంగమంకు పోటెత్తిన వరద

కాళేశ్వరం త్రివేణి సంగమంకు పోటెత్తిన వరద

BHPL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద పోటెత్తింది. ఇక్కడ ప్రవాహం 12.41 మీటర్లకు చేరుకుంది. జ్ఞాన సరస్వతి, సాధారణ పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటడంతో అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.