వెల్లటూరులో గ్రామసభను నిర్వహించిన ఎమ్మెల్యే
NTR: పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామపంచాయితీల విభజనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జీ. కొండూరు మండలం వెల్లటూరులో గ్రామ పంచాయితీ విభజనపై గ్రామసభను నిర్వహించారు. గ్రామస్తుల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా గ్రామాల విభజన, విలీనం జరుగుతుందని తెలిపారు.