విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

VZM: విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికతతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె స్థానిక లక్కవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' నిర్వహణను, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు.