'శుద్ధమైన త్రాగు నీరు చలివేంద్రాలలో అందించాలి'
VZM: రాజాం మండలం బొద్దాం గ్రామంలో పంచాయతీ తరపున గురువారం చలివేంద్రాన్ని చీపురుపల్లి డివిజన్ అభివృద్ధి అధికారి కె హేమ సుందర్ రావు ప్రారంభించారు. గ్రామాలలో ప్రజలు ఎండ వేడిమి నుండి తట్టుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఆ చలివేంద్రాలలో శుద్ధమైన మంచినీరు అందించాలని సూచించారు. అనంతరం ఇండ్ల పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు వసూలు విధానాలను పరిశీలించారు.