నిరుద్యోగుల కలలు కూటమి నెరవేర్చింది: MLA
GNTR: వెలగపూడి ప్రాంగణంలో మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం గురువారం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 58 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేతుల మీదుగా ఈ పత్రాలను అందజేశారు. మెగా డీఎస్సీ నిర్వహణ ఘనత పూర్తిగా ఎన్డీయే కూటమి ప్రభుత్వానిదేనని, యువత ఆశలు నెరవేర్చిన ఈ నిర్ణయం చరిత్రాత్మకం అన్నారు.