సీనియర్ హీరో రాజశేఖర్‌కు ప్రమాదం

సీనియర్ హీరో రాజశేఖర్‌కు ప్రమాదం

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌ ఓ తమిళ రీమేక్ సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన కాలికి తీవ్రగాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా రాజశేఖర్ తమిళ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నాడు.