రాములు మృతి, కుటుంబానికి దహన సంస్కారాలకు కష్టాలు

NZB: బోధన్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన కమ్మరి రాములు అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పట్టణంలోని హరిజనవాడలో కిరాయి ఇంట్లో ఉంటూ కుటుంబ పోషణ సాగిస్తున్న రాములు మరణంతో, ఇంటి పెద్ద దిక్కు లేక కుటుంబం రోడ్డున పడింది. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.