గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది
BDK: మూడు రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు 20.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం, శనివారం ఉదయం 6 గంటలకు 26.3 అడుగులకు చేరింది. అధికారులు 28 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం స్నానఘట్టాలపై నుంచి గోదావరి నీరు ప్రవహిస్తుంది.