బీఆర్ఎస్‌లో చేరిన సర్నేనిగూడెం సర్పంచ్ అభ్యర్థి
BHNG: రామన్నపేట మండలం, సర్నేనిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నీల వెంకటేష్‌కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశంకు ఇవాళ గులాబీ కండువా కప్పి, అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి వెంకటేశం విజయానికి కృషి చేయాలన్నారు.