41 మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NLG: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నేతల కొండల్, లబ్ధిదారులు పాల్గొన్నారు.