జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి

SRD: మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో రూ.273.40 కోట్లతో కొత్తగా 500 పడకల నూతన భవనాన్ని నిర్మించేందుకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు, వైద్య శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి దిశానిర్దేశం చేశారు.