'రామన్నపేటలో రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలి'

BHNG: కరోనా లాక్ డౌన్ సమయంలో రామన్నపేట రైల్వే స్టేషన్‌లో ఆగకుండా రద్దు చేసిన ఆరు రైళ్లను తిరిగి ఆపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 'రామన్నపేట మండలంలో యాభై వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. డిగ్రీ కళాశాల, CHC, సబ్ కోర్టుతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు నిత్యం రైళ్లను ఆశ్రయిస్తున్నారు' అని లోక్‌సభలో ప్రస్తావించారు.