కానిస్టేబుల్ మధుసూదన్‌కు సీపీ ప్రశంసా పత్రం

HYD: విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన కానిస్టేబుల్ మధుసూదన్‌ను సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో మధురానగర్ PS కానిస్టేబుల్ మధుసూదన్‌కు 2024-25 సంవత్సరం నాలుగో క్వార్టర్‌కు గానూ ఆయన ప్రశంసా పత్రంతోపాటు రివార్డును అందజేశారు. మధురానగర్ PSలో ఓ కేసు దర్యాప్తులో మధుసూదన్ పనితీరును గుర్తించి ఈ రివార్డు అందజేసినట్లు తెలిపారు.