UPTADE: PSలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

UPTADE: PSలో పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు

కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలి పలువురు గాయపడిన విషయం తెలిసిందే. వారిని మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. తాజా వివరాలను ఎన్నారై ఆసుపత్రి వెల్లడించింది. క్షతగాత్రులకు ప్రత్యేక బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది. అలాగే, వారిలో ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల్లో కోలుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.