అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

ELR: కామయ్యపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వి. క్రాంతికుమార్, వీఆర్వో ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ మినీ వ్యాన్‌లో తరలిస్తున్న 60 బస్తాల (సుమారు 3,000 కిలోలు) బియ్యాన్ని గుర్తించారు. ఈ బియ్యాన్ని కొయ్యలగూడెంలోని ఓ కోళ్ల ఫామ్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.