మద్యం దుకాణాలకు ఈ నెల 12న లాటరీ నిర్వహణ
కడప జిల్లాలో మిగిలిపోయిన ఏడు మద్యం దుకాణాలకు ఈ నెల 12న లాటరీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణాధికారి రవికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విభాగంలో ఐదు దుకాణాలు, గీత కులాల వారికి రెండు దుకాణాలు ఉన్నాయన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.