శ్రీ ఉమామహేశ్వర దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతన శ్రీ ఉమామహేశ్వర దేవాలయ నూతన కమిటీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా నారాయణ మధుసూదన్ గుప్తా, కార్యదర్శిగా నీలకంఠం నరేష్, కోశాధికారిగా నారాయణ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పూజా కార్యక్రమాల నిర్వహణే లక్ష్యంగా పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.