పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
AKP: కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. బుధవారం సబ్బవరం జూనియర్ కళాశాల ఆవరణలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు మొత్తం తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.