మసీదు నిర్మాణానికి జనసేన రూ. 4 లక్షలు విరాళం

KRNL: దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో నిర్మిస్తున్న పెద్దయ్య తాత పీర్ల మసీదు నిర్మాణానికి ఆదివారం ఆలూరు జనసేన ఇన్‌ఛార్జి రూ.4 లక్షలు విరాళంగా అందజేశారు. సొంత ఊర్లో ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా జరిగే పీర్ల పండుగను గుర్తించి, మసీదు నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తున్నానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.