ఆందోళన చేపట్టిన జనరల్ ఆసుపత్రి సిబ్బంది
NLG: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది గురువారం ఆందోళన చేపట్టారు. 8 నెలలుగా PF, ESI, ఐదు నెలల వేతనాలను చెల్లించకుండా గుత్తేదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సూపరింటెండెంట్ డా. అరుణకుమారి హామి ఇవ్వడంతో వారు అందోళన విరమించారు.