'పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది'
WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదదేవితో కలసి MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.