పాతపేటలో పర్యటించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ పట్టణంలోని పాతపేటలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపేందుకు అధికారులతో చర్చించి పనిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.